December 27, 2011

చుక్కమ్మ చిరు కోరిక

ఆఫీసుకి వెళ్తుంటే అల గాడు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. కానీ నిన్న మాత్రం చాల ఏడ్చింది వెళ్ళద్దని. తలుపు దగ్గర నుంచుని గడియ మీద చెయ్యి వేసి గట్టిగా ఏడుపు మొదలు పెట్టింది. అప్పటికే ఆఫీసుకి లేట్ అయింది. యెంత సర్ది చెప్పినా వినలేదు.
'నువ్వు వెళ్ళద్దని' పెద్ద పెట్టున ఏడుస్తోంది.
ఏడవడానికి కారణం లేకపోలేదు. ఈరోజు ఇంట్లో మధ్యాహ్నం దాక వున్నా. దానికోసం ఒక make-shift ఇల్లు దుప్పటితో కట్టా. దాంట్లో దాని పిల్లల్ని, నా పిల్లలుగా చూసుకుని పడుకోపెట్టా. అదీ దాని సంతోషానికి ఆ తర్వాత ఇప్పటి విచారానికి కారణం. చందమామ కథ మధ్యలో అయిపోయినట్టనిపించెందేమో! ఏడుపులోకి దిగింది.
ఈ చిన్న మెదడులో ఏమి ఆలోచిస్తుంది, ఏయే విషయాలు తలుచుకు ఆందోళన పడుతోంది అని అనిపించింది. ఎలా అర్థం చేయించాలి, ఈ చిన్న wonderకి అనిపించింది. ఆఫీసుకి వెళ్ళకపోతే చెల్లి దగ్గరకు వెళ్ళడానికి డబ్బులు ఎలా వస్తాయమ్మా అని అడిగాను.
నాకు తెలుసు, ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుందని. నువ్వు, అన్నయ్య స్కూల్ కి ఎలా వెళ్తారమ్మా అన్నాను. ఏడుస్తూనే ఆలోచించింది. ఆ చిన్న బుర్రలో ఏ thought ప్రాసెస్ నడిచిందో తేలీదుకాని. ఏయే ఆశల్ని, ఏయే కోరికల్ని ఎలా పరిహరించుకుందో తెలీదు. తనకు తానూ ఎలా సర్ది చెప్పుకుందో తెలీదు.
'మరి, తొందరగా వచ్చెయ్యాలి మరి,' అని కండిషన్ పెట్టింది.
'తప్పకుండానమ్మా' అన్నా.
వెంటనే వెళ్లి సోఫాలో కూచుంది.
ఆఫీసుకి వెళ్లాను, రిపోర్టులు కొడుతూనే వున్నా కానీ మధ్య మధ్యలో చుక్కలాంటి చిన్న మొహం గుర్తొస్తూనే వుంది.

No comments:

Post a Comment

ఏ పార్టీలోకి?

రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని? రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభి...