October 09, 2015

రాయడం ఎవరి కోసం? దేని కోసం?!

A work of art is regarded, not as an ephemeral event, but as an action with far-reaching consequences. Born of reality, it acts back upon reality. Young people will argue a whole night long over a poem. – Ernst Fischer (The Necessity of Art)

“ఈ ఎండని నాకు వెండిలా మండించాలని వుంది; ఈ వెన్నెల్ని మంచినీటితో కడగాలని వుంది; ఈ గాలికి ప్రాణంపోసి పరిగెత్తించాలని వుంది; ఈ కొమ్మల్ని కెరటాల్లా లేపించాలని వుంది. ఆ నీడల్ని చెలరేగిపించాలని వుంది; ఈ సంద్రాన్ని ఉడుకులెత్తించాలని వుంది; ఈ నదులన్నీ నయాగరా జలాలు కావాలని వుంది.
బ్రహ్మజెముడు దొంకల్ని దుంపనాశనం చెయ్యవలిసి వుంది; అక్షర ఆజ్ఞానాన్ని తన్ని తోసివేయవలిసి వుంది. పాలకుల బందూకుల ప్రాణాల్ని జనసేన తీయలవలసి వుంది.
అవును, నాకు రాయాలని వుంది.”
— ఇది నాకు అత్యంత ఇష్టమైన రావి శాస్త్రి గారు ‘నాకు రాయాలని’ అన్న వ్యాసంలోది. ( రావిశాస్త్రీయం, పే. 49-50)
మనం రాసింది ఏ మంచికి హాని చేస్తుందో, ఏ చెడుకు ఉపకారం చేస్తుందో చూసుకు రాయమని హెచ్చరించిన మహా రచయిత.

ఇప్పుడు రచయితల బాధ్యత లేదా బాధ్యతారాహిత్యం గురించి చర్చ నడుస్తున్నది. కవులైనా, రచయితలైనా ఏం చెయ్యాలి? నమ్మినదాని గురించి రాస్తారు. నమ్మిన దాని గురించి మాత్రమే రాయాలి. చెడుకు ఉపయోగపడనిది రాయాలి. కానీ ఇప్పటి చర్చ నేపథ్యంలో అనిపించింది, రచయితగా ఏమైనా తప్పు చేశానా అని. అనుకుని, చదువుతున్నాను  నాకు అత్యంత ఇష్టమైన రావిశాస్త్రి, కొ.కు, చెరబండరాజు వంటి రచయితల రచనల్ని (వీటికోసం వెతకక్కర్లేదు – నా చేతికి అందే దూరంలోనే నా టేబుల్ పై వుంటాయి.) మళ్ళీ ఓసారి. వాళ్ళ రచనలు, జీవితమూ రచయితలకు ఓ ప్రియాంబిల్. ఓ మేనిఫెస్టో.
రచన దానంతట అదే సామాజిక చర్య అంటాడు కొకు. సమాజంలో అసహాయులుగా వున్న వారిలో చైతన్యమూ, బెదిరి వున్నవాళ్లకు ధైర్యమూ, వ్యక్తిత్వం కోల్పోయిన వాళ్ళకు వ్యక్తిత్వమూ ఇవ్వటం కన్న రచయిత చేయగల ఉత్తమమైన పని లేదంటాడు.......
http://magazine.saarangabooks.com/2015/10/08/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A1%E0%B0%82-%E0%B0%8E%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82-%E0%B0%A6%E0%B1%87%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%95%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82/

No comments:

Post a Comment

ఏ పార్టీలోకి?

రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని? రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభి...