June 26, 2016

Bumping into an unknown musician




ఈరోజు వాకింగ్ కి అస్సలు వెళ్ళ బుద్ధి కాలేదు. బద్ధకం, self-pity. ఎంత లేటైనా సరే వెళ్లి తీరాల్సిందేనని 'లోపలి వాడిని' గద్దించి బయల్దేరాను.
వెళ్లడం ఎంత మంచిదైందో ఒక రౌండ్ పూర్తయ్యాక తెలిసింది.
చల్లటిగాలితో కలిసిపోయిన పాట పార్కును హత్తుకుంది. 
'మేరే సాప్నోంకి రాణి కబ్ ఆయేగీ తు
ఆయి రుత్ మస్తానీ క్యాబ్ ఆయేగీ తు ...'
పాట నన్నక్కడే ఆపేసింది. పక్కనే ఆటో ట్యూన్స్ ని పెట్టుకుని, కిషోర్ గొంతును గొప్ప పారవశ్యంతో మౌత్ ఆర్గాన్ తో అనువాదం చేస్తున్నాడు, ఓ మూల బెంచి మీద కూచుని. ఆటో ట్యూన్స్ ప్లేయర్, వాటర్ బాటిల్, ఇంకా ఓ నాలుగైదు మౌత్ ఆర్గాన్లు వున్నాయి.
వాకింగ్ చేస్తున్న వాళ్లు, ఆడుకుంటున్న పిల్లలు, ఇంకా అక్కడ పనిచేస్తున్న వర్కర్లు -- అసలు వాళ్ళక్కడ వున్నరారన్న ధ్యాసే లేదు ఆయనకు.
ఊపిరితిత్తుల శక్తి మొత్తం కూడదీసి, పాట మీది, సాహిత్యం మీది, సంగీతం మీది గొప్ప ప్రేమను ప్రకటిస్తూ మౌత్ ఆర్గాన్ ను ఊదుతున్నాడు. ట్యూన్ కి తగ్గట్టూ ఊగిపోతున్నాడు. ఒకచేత్తో మౌత్ ఆర్గాన్ ని అటూ ఇటూ వేగంతో తిప్పుతూ, రెండో చేత్తో ట్యూన్ కి తగ్గ గాలిని అందిస్తున్నాడు. గాలి వాటాన్ని వాడుకుని నావని నడుపుతున్న పడవవాడి వడుపు కనిపిస్తుంది అతని చేతిలో.
ఒకదాని వెంట ఒకటి, మధ్యలో పెన్ డ్రైవ్ లోని ట్యూన్లను వెతుక్కుంటూ, నోట్ బుక్ లోని లిరిక్స్ ని చూస్తుకుంటూ వాయిస్తూనే వున్నారు, అలుపెరగకుండా. 
అతడు డిస్టర్బ్ అవుతాడేమోనని కొంచెం దూరం నుంచే విని, పాట అయిపోయాక వెళ్లి మాట్లాడేను. ఆయన పేరు రాజ్ కుమార్. జీ ఎచ్ ఎమ్ సీ లో పనిచేసి రిటైర్ అయ్యారు. హార్మోనికా క్లబ్ సభ్యులు. కనీసం ఓ నలభై ఏళ్లుగా మౌత్ ఆర్గాన్ ప్లే చేస్తున్నారు.
"ఎంత గొప్ప ట్యూన్," అన్నాను, ఓ ఆర్ డి బర్మన్ పాట అయిపోయాక.
ఇక తాదాత్మ్యంతో చెప్తున్నాడు, ఆయన ఎంత గొప్ప కంపోజరో. "He died too young. Had he lived longer, we would have got scores of tunes more."
పిల్లలకు ప్రతీ ఆదివారం ఉచితంగా నేర్పుతున్నారట, ఇందిరా పార్కులోనే.
ఈరోజు వాకింగ్ కి వెళ్లడం ఎంత మంచిదైందో కదా అనుకున్నాను.
బహుశా, అందుకే ఖలీల్ జిబ్రాన్ అన్నాడు,
"In the dew of little things the heart finds its morning and is refreshed."
How true! My morning was refreshed.







June 21, 2016

యోగాసనాలు వెయ్యండి. వేస్తే....


Source: Artist unknown, from Pinterest
      నల్లడబ్బు ఇండియాకి రాలేదన్న,
      మాల్యా వెనక్కి రాడేమోనన్న,
      ధరలు కిందకి దిగవేమోనన్న, 
      ప్రత్యేక హోదా ఇవ్వరేమోనన్న, 
      ఉద్యోగాలు రావేమోనన్న,
     పొలాలు పోతా ఏమోనన్న, 
     ఆత్మహత్యలు ఆగవేమోనన్న, 
     అత్యాచారాలు ఎంతకాలమిలా అన్న, 
     పన్నులు పెరగడం ఆగదా అన్న,
     ........ 
     తుఛ్ఛమైన సందేహాలు, భయాలు, ఆందోళనలు 
     కలగకుండా హాయిగా వుంటుంది. 

    యోగా చేసేక కూడా మీకు ఈ సందేహాలు, భయాలు,    
    ఆందోళనలు ఉన్నాయంటే అర్ధం మీరు యోగా సరిగా చెయ్యడం     లేదు. లేదా మీరు జాతి వ్యతిరేకులు అయి వుండాలి.  
    మీరు దోచుకోండి, వేల కోట్లు కొల్లగొట్టి దేశం విడిచి పారిపొండి
    లేదా మతం పేరుతో, కులం పేరుతో మనుషుల మధ్య    
    బ్రహ్మచెముడు కంచెలు వెయ్యండి, ఆదివాసుల కాళ్ళ కింద  
    భూమి లాగేసుకుని గనులు తవ్వండి, -- కానీ యోగా చెయ్యండి.  
    మనసు ప్రశాంతంగా వుంటుంది. 
    మీ మనసు ప్రశాంతంగా లేకుండా చేసే వాళ్ళతో యోగా  
    చేయించే పూచీ మాది. యోగా చేయించి వాళ్ళ మనసు
     ప్రశాంతంగా వుండేటట్టు చేస్తాం.

మీరు యోగా మొదలెట్టేరా లేదా? మొదలు పెట్టండిత్వరగా.
మీరు శలభాసనం వేసేలోగా
అన్నిట్లోనూ విదేశీ పెట్టుబడులకు అనుమతిచ్చేయాలి.
మీరు యోగా మొదలెట్టేరా లేదా? మొదలు పెట్టండిత్వరగా.
మీరు భుజంగాసనం వేసేలోగా
తీరం వెంబడి ఓ నాలుగు అణువిద్యుత్ కేంద్రాలు పెట్టెయ్యాలి
మీరు యోగా మొదలెట్టేరా లేదా? మొదలు పెట్టండిత్వరగా.
మీరు కుక్కుటాసనం వేసేలోగా 
మీ భూముల్ని ముంచేసే ప్రాజెక్టుని ఓకే చేసెయ్యాలి 

యోగా బాగా చెయ్యండి, మీకు చాల అవసరం. 
తర్వాత మళ్ళీ చెప్పలేదంటారు
మీ మనసు, ఆరోగ్యం బాగుండాలంటే 
యోగా చాలా అవసరం.

వేశ్యకి వ్యభిచార దోషం ఉండదు
రాజకీయనాయకులకు అవినీతి దోషం, హత్యా దోషం ఉండదు.
శీర్షాసనం వేసేక కూడా మీకు ఈ సంగతి మీకర్ధం కాకపోతే
మీకిక శాశ్వత శవాసనమే.





June 17, 2016

నకిలీ -- బాబాలు, నాయకులు



(ఫోటోలో, లైఫ్ స్టైల్ భవనం యజమాని
 బురిడీ కొట్టి కోటిన్నర కొట్టేసిన నకిలీ బాబా)
"అంత  చదువుకున్న వాడు, డబ్బున్న వాడు అంత అవివేకంగా దొంగ బాబాకి ఎలా లొంగిపోయాడు? అత్యాశ కాకపోతే ఎక్కడైనా డబ్బు వూరికే రెట్టింపు అవుతుందా? ఆమాత్రం  ఆలోచన ఉండొద్దా?," ఇది ఓ మిత్రుడి కామెంట్. 

నేను అన్నా,

నరమేధం చేసినవాడు దేశాన్ని బాగుచేస్తానంటే,
వెన్నుపోటు పొడిచిన వాడు సింగపూర్ ని చేస్తానంటే, 
ద్రోహుల్ని ఆలింగనం చేసుకుంటున్న వాడు
మన బతుకుల్ని బంగారం చేస్తానంటే,
నమ్మ లేదా? నమ్మటం లేదా? 
వాళ్ళనే నమ్ముతాం కానీ,
మన బతుకులు బండ బతుకులుగానే వున్నాయని
ఎండమావుల వెంటే మనల్ని పరిగెత్తిస్తున్నారని
చెప్పేవాళ్ళని  నమ్ముతామా?
నమ్మం కాక నమ్మం 
అంతే,
దోచుకునే బాబాలను నకిలీ బాబాలుగా గుర్తించినట్టు 
దోచుకునే నాయకులను నకిలీ నాయకులుగా గుర్తించం.

ఏ పార్టీలోకి?

రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని? రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభి...