July 23, 2016

కబాలి మనకి నచ్చదు

రజనీకాంత్ ఈ సినిమాలో సూర్యుడిని చేత్తో ఎగరేసి, కాలితో తన్ని విసిరెయ్యలేదు.
మూడు పిల్లిమొగ్గలేసి ఎగిరే విమానం మీద కూచోలేదు. అణుబాంబుని ఆరు ముక్కలు చేసి ఆర్గురు విలన్ల నోళ్ళలో వి సిరెయ్యలేదు.
ప్రపంచంలోని దుర్మార్గుల్ని, దెయ్యాలని అన్నిటినీ ఓడించెయ్యలేదు. 
ఒకసారి చెప్తే వందసార్లు చెప్పినట్టు అని ఓ రౌడీ చెప్పినట్టు కాక, "ఎగిరే పక్షుల్ని ఎగరనీయాలి. మీ దయతో పంజరంలో పెట్టి చంపెయ్యకండి" అని చెప్తే ఎలా నచ్చుతుంది? పాతికేళ్ళు జైల్లో మగ్గినవాడికి తెలుస్తుంది వెలుగు విలువ. అందుకే కసిగా తీస్తాడు ఓ పంజరం తలుపుని, ఓ పక్షికి ప్రపంచాన్ని ఇస్తాడు.
రజనీకాంత్  మామూలు మనిషిలా గర్భంలోనే సమాధై పోయిందనుకుంటున్న బిడ్డ బతికి ఉండి ఉంటుందా అని వ్యాకులపడితే, ఎవరో పాప కళ్ళల్లో బిడ్డని చూసుకుంటే మనం ఎలా చూడగలం? 

ప్రాణంలో ప్రాణంలాటి భార్య బతికుందో లేదో, భార్య బతికే ఉందని తెలిసేక కలుసుకోవాలని ఉద్వేగపడితే ఎలా భరిస్తాం? భరించలేం.
భార్య బతికేవుందని తెలిసేక చెప్పనలవికాని ఆనందంతో మామూలు మనిషిలాగ, మనలాగ కూలబడితే, మనకి ఎలా నచ్చుతుంది? నచ్చనే నచ్చదు. 
చేతిలో టేబ్, అందులో ఫేస్ బుక్ కాకుండా చీప్ గా మై ఫాదర్ బాలయ్య బుక్ పట్టుకున్నాడు.
ఏదో స్టైలిష్ గా సూట్ వేసుకోకుండా, ఓ ఇరవై సార్లు ఎందుకేసుకోవాలో అంబేద్కర్ ని కోట్ చేసి మరీ చెప్పేడు.
మనకి నచ్చదు కాక నచ్చదు.

ఏ పార్టీలోకి?

రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని? రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభి...