October 28, 2017

ఎంత కష్టం! ఎంత కష్టం!

Not the nation's border. Police personnel on guard at
 the Telangana  Assembly
(Pix courtesy: The Hindu)  

ప్రజా ప్రతినిధుల ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడానికి మేం సిద్ధం. ఏభై రోజులపాటు శీతాకాల సమావేశాలు జరుపుతాం. ఇంకా కావాలంటే ఎన్నిరోజులైనా పొడిగిస్తాం: తెలంగాణ ముఖ్యమంత్రి
ఏభై రోజులంటే రోజుకి ఓ పద్దెనిమిదో ఇరవయ్యో గంటలు చెమటోడ్చి పనిచేస్తారని కాదు. కనీసం పది గంటలు కాదు. తొమ్మిదో, ఎనిమిదో, ఏడో, ఆరో గంటలు కూడా కాదు. ఐదు కూడా కాదు. 
రోజూ పొద్దున్న పదిగంటలకు మొదలై, ఒంటిగంటకు ముగుస్తాయి సమావేశాలు. అంటే కేవలం మూడు గంటలు మాత్రమే కూచుంటారన్న మాట. మరి ప్రజల సమస్యల మీద తలలు బద్దలుకొట్టుకుని బాగా అలిసిపోతారు కదా. విశ్రాంతి అవసరం. కనీసం ఓ 21 గంటలు విశ్రాంతి తీసుకోకపోతే మన సమస్యలకు పరిష్కారాలు దొరకవు.
పాపం! ఎంత కష్ట పడుతున్నారో కదా మనకోసం!
ఇంత శ్రమకు సిద్ధం కావడమంటే మాటలా? అందుకే, భజనపరులు మొదలుపెట్టారు -- ఆహా ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగింది, ఇన్ని రోజులపాటు ఎప్పుడైనా సమావేశాలు జరిపారా, ప్రతిపక్షాల గుండె గుభేల్మంది, చెంప చెళ్లుమంది, కళ్ళు తిరిగాయి -- అని రాస్తున్నారు.
ఒక్కో రోజు సభ నిర్వహణకు ఎంత ఖర్చవుతుంది? రోజుకి మూడు గంటలు కాకుండా ప్రజలంతా పనిచేసినట్టు కనీసం ఎనిమిది గంటలు పనిచేస్తే ఎన్ని రోజుల్లో సమావేశాలు పూర్తిచెయ్యవచ్చు? 
'సిటింగ్' భత్యాల కింద ఒక రోజుకి ఒక్కో సభ్యుడికి, మంత్రికి, ముఖ్యమంత్రికి ఎంత  ఇస్తారు?
ఏభై రోజుల పాటు సభ జరిగితే, ఉన్నతాధికారులు ఆ పనులకే పరిమితమై ముఖ్యమైన నిర్ణయాలన్నీ వాయిదావేస్తారు. కమిషనర్ల ఆఫీసుల్లో పనులన్నీ ఆగిపోతాయి.

పది గంటలకు అసెంబ్లీకి చేరాలంటే ముందు బయలుదేరే ముఖ్యమంత్రి, మంత్రుల కోసం ట్రాఫిక్ నిలువరించాలి. దీనివల్ల, రోజుకి ఏడెనిమిది గంటలు పనిచేయాల్సిన లక్షలాది మంది ఉద్యోగులు ట్రాఫిక్ జామ్ లలో ఇరుక్కుపోవాలి. 


ఏ పార్టీలోకి?

రామయ్య: ఏం, బావా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సోమయ్య: ఏం లేదు బావా, ఎవరికి ఓటేద్దామా అని? రామయ్య: అదేంటి నువ్వు ఫలానా నాయకుడి అభి...